కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ ఉన్నా లేకున్నా గెలిచేది మేమే: కాల్వ శ్రీనివాసులు

  • 271 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నాం
  • ప్రత్యర్థులెవ్వరూ మా దరిదాపుల్లో లేరు
  • సునాయాసంగా మేము గెలుస్తాం: కాల్వ శ్రీనివాసులు
కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు పోటీ ఉన్నా లేకపోయినా గెలుపు తమ పార్టీ అభ్యర్థిదేనని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, 271 ఓట్ల మెజార్టీతో తాము ముందంజలో ఉన్నామని, ప్రత్యర్థులెవ్వరూ కూడా తమ దరిదాపుల్లో లేరని అన్నారు. కర్నూలు జిల్లా అభివృద్ధి దృష్ట్యా కేఈ ప్రభాకర్ ను తమ పార్టీ తరపున బరిలో నిలబెట్టామని, అందరూ సహకరిస్తే సంతోషమని, సునాయాసంగా తమ పార్టీ గెలుస్తుందని కాల్వ శ్రీనివాసులు తెలిపారు.

Telugudesam
kalva

More Telugu News